JN: జాఫర్గడ్ పట్టణ కేంద్రంలోని ‘మా ఇళ్లు’ అనాధాశ్రమాన్ని ఆదివారం పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, వారి చదువు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య ఇటీవల NIA అరెస్ట్ కావడంతో ఆయన సతీమణిని ఓదార్చి ధైర్యం చెప్పారు.