CTR: రొంపిచర్లలో TV సీరియల్ నటి మధుప్రియ సందడి చేశారు. కట్ట కింద శివాలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఆమె 200కు పైగా సీరియల్స్, 25 సినిమాల్లో నటించినట్లు తెలిపారు. మంగమ్మగారి మనవరాలు సీరియల్‌కు నంది అవార్డు, సావిత్రి సీరియల్‌కు బెస్ట్ మదర్ అవార్డు సహా పలు అవార్డులు అందుకున్నట్లు చెప్పారు. గత 25 ఏళ్లుగా వివిధ TV ఛానల్స్‌లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు.