BHNG: రామన్నపేట మండలం, శోభనాద్రిపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎటెల్లి పరమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి నియామక పత్రం అందించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పున్న జగన్మోహన్, మేడి రవిచంద్ర, వెంకటరెడ్డి, రాంరెడ్డి, జమీరుద్దీన్ పాల్గొన్నారు.