KMM: మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆదివారం కూసుమంచి మండలం చేగొమ్మలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గెలిచినా, ఓడినా ప్రజలే కుటుంబంగా పనిచేశానని, ప్రస్తుత నాయకులు ప్రజలను దూషించడం బాధాకరమని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజలకు చేసే సేవ మాత్రమే నిలిచిపోతుందని తెలిపారు. పాలేరులో బీఆర్ఎస్ పునరుజ్జీవం మొదలైందని, గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులను సన్మానించారు.