ATP: శింగనమలలోని ప్రధాన రహదారులు, డ్రైనేజీ కాలువలను ఎమ్మెల్యే బండారు శ్రావణి నేడు పరిశీలించారు. డ్రైనేజీలు వ్యర్థాలతో నిండి దుర్గంధం వెదజల్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై చెత్త వేయకుండా డస్ట్ బిన్లు వాడాలని వ్యాపారులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రతలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఆమె కోరారు.