HNK: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రేపు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ CPI ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు CPI జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు. గుడిసె వాసులకు పట్టాలు పంపిణీ చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, తుపాను బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.