MLG: మంగపేట మండల కేంద్రంలో నిర్మిస్తున్న RTC బస్టాండ్‌ను ఇవాళ బీజేపీ ముఖ్య నేతలు పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. ప్లాట్‌ఫాం ఎత్తు తక్కువగా ఉండటంతో వర్షాకాలంలో ప్రయాణికులు ఇబ్బందులు పడతారని, నిబంధనలకు విరుద్ధంగా మట్టితో పనులు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని విమర్శించారు. అధికారులు స్పందించాలని కోరారు.