PLD: ఈపూరు మండలంలోని పలు ఎరువులు, పురుగు మందుల దుకాణాలను ఆదివారం ఏవో ఆర్. రామారావు తనిఖీ చేశారు. ఎవరైనా అధిక ధరలకు యూరియా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రబీ సీజన్‌కు సరిపడ యూరియాను ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. రైతులు అధికంగా యూరియాను వాడొద్దన్నారు. అంతేకాకుండా ఎవరూ యూరియా నిల్వ ఉంచుకోవద్దన్నారు. అవసరమైన మేరకే తీసుకువెళ్లాలని సూచించారు.