AP: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్ సమీపిస్తుండగా AC బోగీలో మంటలు చెలరేగాయి. లోకో పైలట్, గార్డ్ వెంటనే అప్రమత్తమై అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్లో రైలు నిలిపివేశారు. మంటలు B1 నుంచి రెండో బోగీకి అంటుకున్నాయి. దీంతో రైల్వే సిబ్బంది ఇతర బోగీలను వేరు చేయగా.. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.