NLG: జీవో నెంబర్ 252 ను సవరించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండు రకాల కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో జర్నలిస్టుల్లో ఆందోళన కలుగుతుందని పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పత్రికల వారికి కూడా న్యాయం చేసి, జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలన్నారు.