ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో జరుగుతున్న NSS శిభిరం ఆదివారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా మహాగావ్ షేకుగూడ గ్రామ సమీపంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారి బాలాజీ కాంబ్లే విద్యార్థులకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. వారం రోజుల పాటు శిభిరం జరగనుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.