ADB: నార్నూర్ మండలంలోని మహాగాం గ్రామంలో ఆదివారం గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు వేశారు. సర్పంచ్ మేస్రం భీంబాయి సూచన మేరకు వెటర్నరీ అసిస్టెంట్ జగ్నాక్ మాధవ్ ఈ కార్యక్రమం నిర్వహించారు. పశువులకు సోకే సీజనల్ వ్యాధుల నివారణకు ఈ మందులు ఎంతో మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని పశుపాలకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.