ASF: వాంకిడి మండలంలోని హనుమాన్ టెంపుల్ ఏరియాకు చెందిన కృష్ణ మొబైల్ పోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి బాధితుడికి అప్పగించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. మొబైల్ ట్రేస్ చేసిన కానిస్టేబుల్ నయీమ్ను ఆయన అభినందించారు. మొబైల్ పోయినట్లయితే వెంటనే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.