MNCL: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హామీ ఇచ్చారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో కార్మికులు ఆదివారం ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలు వివరించారు. ఎలక్ట్రికల్ విభాగాల్లోని కార్మికులకు మున్సిపల్ కార్మికులతో సమాన వేతనం ఇప్పించాలని కోరారు.