AP: నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను శ్రీశైలం కుడి కాల్వలో తోసేసి ఆత్మహత్య చేసుకుంది. మృతులను ఒండుట్లకు చెందిన లక్ష్మీదేవి, వైష్ణవి, సంగీత (5 నెలలు)గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం కావచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.