MNCL: తాండూర్ మండల కేంద్రంలోని పతంగులు విక్రయ దుకాణాలను ఆదివారం అటవీ శాఖ అధికారులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ప్రాణాంతకమైన చైనీస్ మాంజ విక్రయించకూడదన్నారు. చైనీస్ మాంజ వాడడం వలన పక్షులకు, మనుషులకు ప్రాణాపాయం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో తిరుపతి, ఎస్వో సువర్ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ భాస్కర్ పాల్గొన్నారు.