KMR:హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 4,608 మంది కళాకారులు 40 నిమిషాల పాటు కూచిపూడి నృత్యం చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి కళావైభవం 2 పేరిట ఈ ప్రదర్శనలు చేపట్టారు. కామారెడ్డి పట్టణానికి చెందిన కూచిపూడి కళాక్షేత్రం నుంచి 30 మంది కళాకారులు ఈ నాట్య ప్రదర్శనలో పాల్గొన్నారు.