ADB: ఉట్నూర్ గ్రామానికి చెందిన బీఈడీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ మెస్రం మనోహర్ ఆదివాసీ ప్రధాన్ పురోహిత సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నికయ్యారు. ఉట్నూర్ ఎక్స్ రోడ్లోని హీరా సుఖ ప్రాంగణంలో ఆదివాసీ ప్రధాన పురోహిత సేవా సమితి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశంలో ఎన్నికయ్యారు.