శబరియల యాత్రలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. అయ్యప్ప స్వాములు ఎంతగానో ఎదురు చూస్తున్న మకర జ్యోతి దర్శనానికి ముహూర్తం ఖరారైంది. 2026 జనవరి 14న సాయంత్రం సుమారు 6.30 గంటల నుంచి 6.55 మధ్య మకరజ్యోతి దర్శన భాగ్యం కలగనుంది. కాగా, అదే నెల 19 వరకు దర్శనాలకు అనుమతి ఉంటుందని, 20న ఆలయాన్ని మూసివేయనున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది.