PLD: రొంపిచర్ల, రెడ్డిపాలెం గ్రామాల్లోని మద్యం షాపులను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆదివారం తనిఖీ చేశారు. షాపుల్లోని స్టాక్ రిజిస్టర్లను పరిశీలించిన ఆయన, నిబంధనల ప్రకారం ధరల పట్టికలను ప్రదర్శించాలని సిబ్బందిని ఆదేశించారు. కల్తీ మద్యం, నాటు సారా లేదా కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.