HYD: బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల అంతర్జాతీయ సమ్మేళనం BGM-2026 పోస్టర్ను(బిట్సా గ్లోబల్ మీట్-2026) నేడు తెలంగాణ IT శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా విడుదల చేసినట్లు BGM-26 ఛైర్పర్సన్ అనిత సాకురు, సీఈఓ మయూర్ పట్నాల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 9 నుండి 11 వరకు HYDలో జరగనున్న BGM-26లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు పాల్గొంటారన్నారు.