KMR: పిట్లం మండలం హస్నాపూర్ సమీపంలోని మూలమలుపు వద్ద ఆదివారం ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిల్లర్గి గ్రామానికి చెందిన మరియవ్వ తీవ్రంగా గాయపడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి ప్రాథమ చికిత్స అందించారు.