ప్రకాశం: గిద్దలూరులో అర్బన్ సీఐ సురేష్ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం ఏఎస్ఐ జిరాని విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ప్రతి ఒక్కరూ వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.