NLG: బాలికలు ప్రభుత్వం అందిస్తున్న విద్యా వసతులను సద్వినియోగం చేసుకుని రాణించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. మాడ్గులపల్లిలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాల నూతన భవనాన్ని ఇవాళ కలెక్టర్ త్రిపాఠి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో కలిసి ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడారు.