శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ అదరగొడుతోంది. గత రెండు మ్యాచ్ల్లో అజేయ హాఫ్ సెంచరీలతో మెరిసిన ఆమె, తాజాగా నాలుగో టీ20లోనూ ఆ జోరును కొనసాగించింది. కేవలం 30 బంతుల్లోనే అర్ధ శతకాన్ని బాదిన షఫాలీ, ఈ సిరీస్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు నమోదు చేసింది.