KNR: సైదాపూర్ మండల కొత్త ఎస్సైగా పీ. స్వాతి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన తిరుపతి కరీంనగర్ సీసీఆర్బీకి బదిలీ అయ్యారు. గతంలో మానకొండూరులో ఎస్సైగా పని చేసిన స్వాతి, బదిలీపై సైదాపూర్‌కు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.