GDWL: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవదైన జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆదివారం ఆర్టీఐ (RTI) కమిషనర్ పి.వి. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈవో, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం కమిషనర్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు.