TG: శాసనసభ సమావేశాల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్, నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నదీ జలాలు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేపట్టారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలపై చర్చించారు. శాసనసభలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై మాట్లాడారు.