KRNL: ఎమ్మిగనూరులోని ఆటోనగర్లో అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ 814వ ఉరుసు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాజుద్దీన్ స్వాములు ఉరుసు మత సమరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. కుల, మత భేదాలను దాటి ప్రతి ఏడాది అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురికి సన్మానం చేశారు.