WGL: సంగెం మండలంలో ఇవాళ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి.. కేక్ కట్ చేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పాత్ర మరువలేనిదని, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందన్నారు.