SRPT: జనవరి 18న ఖమ్మంలో జరిగే సీపీఐ శతజయంతి బహిరంగ సభను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. ఈనెల 30న సూర్యాపేటలో జరిగే జిల్లా కౌన్సిల్ సమావేశానికి జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ సత్యం హాజరవుతారని, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు.