SRD: నూతన సంవత్సర వేడుకలకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ ఆదివారం తెలిపారు. డివిజన్ పరిధిలోని ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. పోలీసుల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.