TG: ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రహ్లాద్ పేరుతో రవికి పాన్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని గతంలో రవి చెప్పాడు. ఈ క్రమంలో బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పోలీసులు పిలిపించారు. అనంతరం రవి ఎదుటే ప్రహ్లాద్‌ను ప్రశ్నించారు. ఐబొమ్మ రవి ఎవరో తనకు తెలియదని ప్రహ్లాద్ చెప్పినట్లు తెలుస్తుంది.