వరంగల్ జిల్లాలో యూరియా పంపిణీని మరింత పారదర్శకం చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. రేపటి నుంచి జిల్లావ్యాప్తంగా యూరియా యాప్ను అందుబాటులోకి తెస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఉన్న రైతులు గూగుల్ ప్లే స్టోర్ ‘Fertilizer Booking App’ టైప్ చేసి అప్లికేషను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.