BDK: మణుగూరు దమ్మకపేట వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ రోడ్డు మీదికి వస్తున్న సమయంలో ఈ-బయ్యారం నుంచి అతివేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే బీటీపీఎస్కు చెందిన ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ తెలగవరపు కోటేశ్వరరావు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.