MBNR: ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారనే నమ్మకంతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని నిరుద్యోగ యువత ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి విన్నవించారు. 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.