KDP: కలసపాడులో రేపు ప్రత్యేక ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ మధురవాణి తెలిపారు. బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో మండలస్థాయిలో అన్ని శాఖల అధికారులు హాజరవుతారని తెలిపారు.