శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 35 (18 బంతుల్లో), స్మృతి మంధాన 26 (15 బంతుల్లో) పరుగులతో దంచికొడుతున్నారు. ఈ జోరు చూస్తుంటే భారత్ భారీ స్కోరు సాధించేలా కనిపిస్తోంది.