BDK: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వెంటనే వైద్యం అందిస్తూ ఆర్ఎంపీ వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో నిర్వహించిన ఆర్ఎంపీడబ్ల్యూఏ మండల సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గ్రామాల్లో చిన్నచిన్న అనారోగ్య సమస్యల నుంచి స్పందించేది ఆర్ఎంపీలే అని అన్నారు.