ELR: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 30వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు పరిశీలన నిమిత్తం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం ద్వారకతిరుమల వెళ్లనున్నారని, అందువలన పీజీఆర్ఎస్లో అందుబాటులో ఉండరన్నారు.