BPT: బల్లికురవ మండలంలో 27వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లుగా ఎస్సై నాగరాజు తెలిపారు. బల్లికురవ చెందిన ప్రశాంత్ కుమార్ బల్లికురవ నుండి మక్కినవారిపాలెం వెళుతుండగా చెన్నుపల్లి వద్ద అదుపుతప్పి రోడ్డు మార్గంలో ఉన్న కాలవలో పడి మృతి చెందారని చెప్పారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసామన్నారు.