కాకినాడ రూరల్ మండలం సర్పవరంలోని భావన్నారాయణ స్వామి వారి దేవస్థానంలో ఎమ్మెల్యే నానాజీ పలు అభివృద్ధి పనులను ప్రారంభిచారు. ఆలయంలో గోశాల, గృహ సంకల్ప స్థానం, ఊయల మండపం, తులాబారం, సుదర్శన యాగ శాల, ప్రసాదం కౌంటర్లను ఆయన ప్రారంభించారు. భావనారాయణ స్వామి వారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.