AP: నరసాపురం లేస్ క్రాఫ్ట్ను ప్రధాని మోదీ ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోదీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పారు. కుటుంబాల జీవనాధారంగా మారిన నరసాపురం లేస్ ఏపీకి గర్వకారణమన్నారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థకు లేస్ కీలకంగా మారిందని తెలిపారు. లేస్ కళను మరింత ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.