BDK: ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతరత్న రతన్ టాటా దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కొనియాడారు. కొత్తగూడెంలోని టాటా ఏఐఏ బ్రాంచ్లో రతన్ టాటా 88వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ముఖ్య అతిథిగా హాజరై, కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.