ELR: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మౌలిక వసతుల కల్పన ద్వారా గ్రామాల రూపురేఖలు మారుస్తున్నామని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పద్మశ్రీ ప్రసాద్, పోలవరం MLA చిర్రి బాలరాజు అన్నారు. కొయ్యలగూడెం మండలం కుంతలగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్, సీసీ డ్రెయిన్ పనులను ప్రారంభించి, కుంతలగూడెం నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు.