NLR: కావలి మండల మహిళా సమాఖ్య 20వ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెలుగు కార్యాలయం వద్ద పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన రంగురంగుల ముగ్గులను పరిశీలించారు. మహిళల సృజనాత్మకత, కళాత్మకత అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు.