మహిళల హాకీ ఇండియా లీగ్ రెండో సీజన్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో రాంచీ రాయల్స్, ఎస్జీ పైపర్స్, జేఎస్‌డబ్ల్యూ సూర్మ హాకీ క్లబ్, శ్రచి బెంగాల్ టైగర్స్ జట్లు పాల్గొంటున్నాయి. ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌లో రాంచీ రాయల్స్, ఎస్జీ పైపర్స్ జట్లు తలపడనున్నాయి. జనవరి 10న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది.