BDK: సింగరేణి సంస్థ నర్సరీలో పనిచేస్తున్న కార్మికులకు జీవో ప్రకారం కనీస వేతనాలను అమలు చేయాలని యూనియన్ రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య అన్నారు. సీఎంపీఎఫ్, ఈఎస్ఐ, 8.33% బోనస్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం సింగరేణి సెంట్రల్ నర్సరీలో కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు.