KDP: బద్వేలు పట్టణంలో డివైన్ స్పా పేరుతో నెల్లూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఎస్ఐ జయరాములు, కానిస్టేబుళ్లు దాడులు నిర్వహించడంతో ఇద్దరు యువతులు, రాయచోటికి చెందిన కాంట్రాక్టర్ ధనుష్ కుమర్, మరో వ్యక్తి జగదీష్ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం స్పా సెంటర్ను సీజ్ చేశారు.