కృష్ణా: గుడివాడ ఏలూరు రోడ్డులో సుందరీకరణ కోసం డివైడర్లపై ఇటీవల ఏర్పాటు చేసిన కార్పెట్లు కొందరు మందుబాబులకు విశ్రాంతి కేంద్రమయ్యాయి. ప్రజల సౌకర్యం, నగర సౌందర్యం పెంచాలనే ఉద్దేశంతో వేసిన కార్పెట్లపై రోడ్డు మధ్యమత్తులో హాయిగా నిద్రపోతూ, వాహనదారులకు ఆదివారం ఇబ్బందులు కలిపిస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.